చోరీని అరికట్టేందుకు కరెంట్​ సంస్థల నిర్ణయం

ఇప్పటికే 148 పోలీసు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్​
సిద్దిపేటలో యాంటీ థెఫ్ట్​ స్క్వాడ్​ పోలీస్​స్టేషన్​ ఏర్పాటు
రూల్స్​ మీరితే ఫైన్లు.. వినియోగదారులకు చలాన్లు
రైతుల మోటార్లకు మీటర్లు..డీసీఎం మెజర్స్​ అమలు

ఇంట్లో 4 మీటర్లకు పానెల్​ బోర్డుహైదరాబాద్​, వెలుగు: కరెంట్​ చోరీని అరికట్టేందుకు కరెంట్​ సంస్థలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. కరెంట్​ ఠాణాలను ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పటికే జెన్​కో ద్వారా 148 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్​ కూడా ఇచ్చాయి. డీఎస్పీ, అసిస్టెంట్​ కమాండెంట్లు 10, ఇన్​స్పెక్టర్లు (సివిల్​) 1, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్లు 11, సబ్​ ఇన్​స్పెక్టర్లు ఆర్​ఎస్​ఐ 1, సివిల్​ ఎస్​ఐ 13, సివిల్​, ఏఆర్​ హెడ్​కానిస్టేబుళ్లు 36, కానిస్టేబుళ్లు 31, ఉమెన్​ పోలీస కానిస్టేబుళ్లు సివిల్​ 44 పోస్టులకు హోం డిపార్ట్​మెంట్​ నుంచి డిప్యూటేషన్​ఫై రిక్రూట్​ చేసుకునేందుకు నోటిఫికేషన్​ విడుదల చేశాయి. సిద్దిపేటలో యాంటీ పవర్​ థెఫ్ట్​ స్క్వాడ్​ పోలీస్​స్టేషన్​ను ఏర్పాటు చేశాయి. పవర్​ థెఫ్ట్​ స్క్వాడ్​ ఇన్​స్పెక్టర్​ (సివిల్​)ను నియమించాయి. ప్రస్తుతం చోరీలపై నజర్​ పెట్టేందుకు కరెంట్​ డిపార్ట్​మెంట్​లోనే విజిలెన్స్​ వింగ్​ ఉంది. అందులో కొందరు పోలీసులు డిప్యూటేషన్​పై పనిచేస్తున్నారు. ఇకపై దానిని మరింత స్ట్రాంగ్​ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కరెంట్​ ఠాణాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

మూడు నెలల కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ ఫ్రీజ్

వినియోగదారులు మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ ను అధికారులు ఫ్రీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మళ్లీ కనెక్షన్ ఇవ్వాలంటే కరెంట్ బిల్లుకు అదనంగా ఫైన్ కట్టించుకోవాలని యోచిస్తున్నారు. కనెక్షన్ తీసుకునే టైంలో పేర్కొన్న లోడ్ కు మించి వాడినా ఫైన్లు వేయనున్నారు. సాధారణంగా ఇళ్లకు కిలోవాట్ లోడుతో కరెంట్ కనెక్షన్ ఇస్తుంటారు. అయితే, ఎక్కువ లోడ్ కలిగిన ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్
మెషీన్లు, వాటర్ హీటర్లు, టీవీలు, కంప్యూటర్ల వల్ల లోడ్ నాలుగైదు కిలోవాట్లకు పెరుగుతుంటుంది. మామూలుగా అయితే కిలోవాట్ లోడుకు ₹1,200 చొప్పున డెవలప్ మెంట్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో వాడే లోడ్ కు తగ్గట్టు బిల్లులు, కనెక్షన్ చార్జీలను వసూలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తల కోసం

 

Latest Updates