దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు నమోదు

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.కర్ణాటకలో ఇవాళ 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హసన్ జిల్లా చన్నరాయపట్న పోలీసు స్టేషన్ లో నలుగురు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ అయింది.

జేడీఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారన్న ఆగ్రహంతో తమ కార్యకర్తల ఇళ్లపై 200 మందితో కలసి వచ్చిన సూరజ్, దాడికి పాల్పడ్డారని, లక్షలాది రూపాయల ఆస్తులను ధ్వంసం చేశారన్నది బీజేపీ కార్యకర్తల ఆరోపణ. సమయానికి పోలీసులు రాకుంటే నష్టం భారీగా జరిగి ఉండేదని తెలిపారు. గాయపడిన కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సూరజ్ సహా మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తోందని జేడీఎస్ ఆరోపిస్తోంది.

Latest Updates