కారుకు ఓటేస్తేనే పనులవుతాయి: రసమయి

టీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని, ఇతరులు గెలిస్తే పనులు కావని టీఆర్​ఎస్​ మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. కారుకు అడ్డం పడితే టక్కరైతరని హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగాఆయన కరీం నగర్​ జిల్లా మానకొండూర్​ మండలకేంద్రంలో ని గంగిపల్లి, కొండపలకల గ్రామాల్లో మా-ట్లాడారు. ‘‘ఇప్పుడు మంచి మంచి ఎమ్మెల్యేలు వచ్చి గులాబీ జెండా కప్పుకచ్చుకుంటున్నరు. ఊరంతా ఒకదిక్కుంటే ఊసుకండ్లోళ్లు ఒక దిక్కు ఉన్నట్టు ఉండద్దు. కారుకు అడ్డం పడితే టక్కరైతది తప్ప పనులైతయా అని అడుగుతున్న”అని ప్రశ్నించారు.‘‘కారు గుర్తు గెలిస్తే మాత్రమే పనులైతయి. వేరోళ్లు ఇది జేస్త అది జేస్త అంటే ఏమీ కాదు. ఊరికి కావాల్సి న పర్మిషన్లు గిర్మిషన్లు అన్ని నేనే ఇప్పిస్త. కల్యాణలక్ష్మికి ఎమ్మెల్యేగా నేను సంతకం పెడితేవస్తది .సర్పంచ్ వేరే దిక్కుకు పోతే వస్తదా ? సీ ఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే ఏముఖంపెట్టు కొని అడుగుతరు. ఒక్క ఓటు కూడా వేరే దిక్కు కు వేస్తే పనులు కావు”అనిపేర్కొన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలుపిండితే రావని, టీఆర్​ఎస్​ అభ్యర్థులకే ఓటు వేయాలని అన్నారు.

Latest Updates