ఓటేసిన సీఎంలు, సినీ ప్రముఖులు

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ తక్కువగా నమోదయ్యింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ , పలువురు సెలబ్రీటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

బాంద్రా (వెస్ట్) లోని  పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి నటుడు అమీర్ ఖాన్ ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహారాష్ట్ర పౌరులందరూ బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని  విజ్ఞప్తి చేశారు అమీర్.

అలాగే మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి ఆయన భార్య లారా దత్తా, నటి మాదూరీ దీక్షిత్, ఓటు హక్కు వినియోగించుకున్నారు.  లాతుర్‌లోని పోలింగ్ బూత్‌లో  రితేశ్ దేశ్‌ముఖ్, అతని భార్య జెనెలియా డిసౌజా తమ  ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆయన భార్య అమృత, అమ్మ సరిత నాగ్ పూర్ లో  ఓటు వేశారు. హర్యానా సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్  కర్నలో లో ఓటు వేశారు.

Latest Updates