మహారాష్ట్ర: సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. రేపటితో ఆయన పదవీ కాలం పూర్తవనుండటంతో ఈరోజే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారాయ్ ను రాజ్ భవన్ లో కలిసి రాజీనామాను సమర్పించారు. ఫడ్నవిస్ తో పాటు పలువురు మంత్రులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే… సీఎం పదవికోసం శివసేన పట్టుబడుతున్న సందర్భంలో.. బీజేపీ  నిరాకరించింది. తుదకు ఆర్ఎస్ఎస్ కల్నించుకున్నాకాని సమస్య ఎటూ తేలలేదు. గవర్నర్ కు రాజీనామా ఇచ్చిన తర్వాత  మీడియాతో మాట్లాడిన ఫడ్నవిస్… శివసేనతో తాము చెరిసగం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి ఒప్పందం చేసుకోలేదని చెప్పారు.

Latest Updates