ఈఎస్ఐ స్కామ్ : దేవికారాణి ఆస్తి 100 కోట్లు

ఈఎస్ఐ స్కామ్​లో 100 కోట్ల అక్రమాస్తులు
ఆమె డైరెక్షన్​లో కూడబెట్టిన భర్త గురుమూర్తి అరెస్టు
రిమాండ్కు తరలించిన ఏసీబీ
జువెల్లరీకి రూ. 7.3 కోట్ల చెల్లింపులు
23 బ్యాంకుల్లో రూ.1.13 కోట్ల బ్యాలెన్స్
₹ 6.63 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు
హైదరాబాద్, చిత్తూరు, వైజాగ్ లో అక్రమాస్తులు
ఏసీబీ దర్యాప్తులోతవ్వేకొద్దీ కొత్త విషయాలు

హైదరాబాద్, వెలుగుఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి భర్త గురుమూర్తిని ఏసీబీ గురువారం అరెస్ట్ చేసింది. సివిల్ సర్జన్ గా పనిచేసి రిటైరైన గురుమూర్తి.. ఈఎస్ఐ మందులు, కిట్స్ కొనుగోళ్లలో అక్రమాలు చేసినట్లు, భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డట్లు ఏసీబీ గుర్తించింది. ప్రధాన నిందితురాలు దేవికారాణి ఆస్తులపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఆమె భర్త గురుమూర్తి కూడా అవినీతికి పాల్పడ్డట్లు దర్యాప్తులో తేల్చారు. అవినీతి డబ్బుతో అక్రమాస్తులు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్ఐ మందుల స్కామ్ కేసులో దేవికారాణి సహా మరో 18 మంది అరెస్టయ్యారు.

ఫార్మా కంపెనీల నుంచి భారీగా వసూళ్లు

గురుమూర్తి సంపాదన వివరాలను ఏసీబీ సేకరించింది. ఫార్మా కంపెనీల నుంచి భారీ మొత్తంలో లంచాలు వసూలు చేసి ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తో పాటు తిరుపతి, చిత్తూరు, వైజాగ్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు, వ్యవసాయ భూములు, కార్లను కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. 18 ప్రాంతాల్లో గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.14 కోట్లుగా లెక్కలు తేల్చింది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చూస్తే తనిఖీల్లో బయటపడ్డ ఆస్తుల విలువ రూ.100కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అక్రమాస్తులు ఇవీ..

షేక్ పేట్ లో విల్లా, జూబ్లీహిల్స్ బిల్డింగ్ రూ.3.80 కోట్లు, సోమాజిగూడ ఆర్ఆర్ఎస్ టవర్స్ లోని ఫ్లాట్ విలువ రూ.1.27 కోట్లు, హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 16 కమర్షియల్ కాంప్లెక్స్ ల విలువ రూ.3.85 కోట్లుగా ఏసీబీ నిర్ధారించింది. కన్ స్ట్రక్షన్ కంపెనీల్లో రూ 6.63 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు, 23 బ్యాంకుల్లోని బ్యాలెన్స్ రూ.1.13 కోట్లుగా లెక్క తేల్చింది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని మల్టీ స్టోర్ బిల్డింగ్ విలువ రూ.కోటి, రెండు రాష్ట్రాల్లోని11 ప్రాంతాల్లో ఓపెన్ ప్లా్ట్స్ విలువ 88.47 లక్షలుగా గుర్తించింది. గురుమూర్తి ఇంట్లో రూ.25.72 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణలతోపాటు కారు, ఫిక్స్​డ్ డిపాజిట్ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.
జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో మెడికల్ స్కామ్ కేసులో చేతులు మారిన డబ్బు వివరాలను ఏసీబీ రాబడుతున్నట్లు తెలిసింది.

Latest Updates