కేసీఆర్ కోసం క్యూలైన్ ఆపేశారు: ఉక్కపోతతో భక్తుల ఇబ్బందులు

ఉజ్జయినీ మహంకాళీ ఆలయం వద్ద అధికారులు, పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనానికి వస్తున్నారంటూ భక్తులను నిలిపివేశారు. దాదాపు 20 నిమిషాలపైగా క్యూలైన్ నిలిపివేయడంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. ఉక్కపోత తో లైన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోనం ఎత్తుకున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా భక్తులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ముందు నుంచే ఆపివేయడం ఏంటని ప్రశ్నించారు. వీఐపీల కోసం ప్రత్యేక లైన్లు ఉన్నా…సామాన్య భక్తులను నిలిపేవేయడం ఎందుకుని అధికారులను నిలదీశారు.

Latest Updates