శ్రీవారి మెట్ల మార్గంలో రేపటి నుంచి భక్తులకు అనుమతి: టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులను రేపటి (గురువారం) నుంచి మెట్ల మార్గంలో అనుమతించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా తిరుమలకు దారితీసే రెండు ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాన్ని అప్పట్లో మూసివేశారు. ఆ తర్వాత మొదటి సారిగా మెట్ల మార్గం తెరుచుకోనుంది.

Latest Updates