వేములవాడలో జన జాతర

    భక్తులతో కిక్కిరిసిన ఆలయం

    2లక్షలకు పైగా రాక

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, చత్తీగఢ్ రాష్ట్రాల నుంచి  భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 2లక్షల మందికి పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. దర్శనానికి 8గంటలకు పైగా సమయం పట్టింది. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ఉండేందుకు గదులు దొరకలేదు. రాజన్న ఆలయ వసతి గదులు, ప్రైవేట్​గదులు నిండిపోయాయి. దీంతో చాలామంది బయట చలిలోనే బస చేశారు. చిన్నారులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Latest Updates