బాసరకు క్యూ కట్టిన భక్తులు

నిర్మల్ జిల్లాలోని  బాసర సరస్వతి అమ్మవారి  ఆలయానికి భక్తులు క్యూకట్టారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో ఆలయంలో రద్దీ పెరిగింది. ఉదయం సరస్వతి, మహాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు  ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. 19 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతుండటంతో  విద్యార్థులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. అమ్మవారి పాదాల దగ్గర పెన్నులు, హాల్ టికెట్లు పెట్టి పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు  చేశారు.

Latest Updates