బాసరలో ఫుల్ రష్ : భక్తుల అవస్థలు

నిర్మల్ జిల్లా: చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన బాసర క్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. వసంతోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో… జనం అర్ధరాత్రి నుంచే గుడికి వచ్చారు. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో దర్శనం కోసం నిలుచున్న భక్తులకు పాలు, నీళ్లు అందించేకపోయారు నిర్వాహకులు. దీంతో ఇబ్బందిపడ్డామని భక్తులు చెప్పారు. వీఐపీలకు దర్శనం కల్పిస్తూ, సామాన్యులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో పిల్లలతో ఇబ్బంది పడ్డామని భక్తులు ఆవేదనగా చెప్పారు.

Latest Updates