రాష్ట్రంలో నేరాలు చేయాలంటే వాళ్లకి భయం

సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించామన్నారు డీజపీ మహేందర్ రెడ్డి.   నాంపల్లి ప్రాంతాల్లో కొత్తగా రెండు పోలీస్ స్టేషన్ల భవనాలను అవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  మహిళల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ పెద్ద పీఠ వేసిందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు.  చట్టాలను గౌరవిస్తున్న వారి పట్ల పోలీస్ శాఖ వారికి అండదండలు అందిస్తుందన్నారు.  నేరం చేస్తే దొరికి పోతాము అనే భయాన్ని తెలంగాణ పోలీస్ శాఖ తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్టానికి వచ్చి నేరాలు చేసే వారు భయపడుతున్నారన్నారు.  దేశ వ్యాప్తంగా మహిళల భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ గా ఉందన్నారు.

Latest Updates