క్యాబ్ ప్రయాణం మరింత సురక్షితం… నిమిషాల్లో రక్షణ: డీజీపీ

క్యాబ్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సెక్యురిటీ కోసం ఎమర్జెన్సీ సర్వీస్ ను మరింత పటిష్టం చేసినట్టు రాష్ట్ర డీజీపీ మహెందర్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… క్యాబ్ లో ప్రయాణించే వారికి ఏదైనా ఆపద ఎదురైతే…   ప్రయాణికులు ప్రయాణిస్తున్న క్యాబ్ కంపెనీ యెక్క యాప్ లో ఎమర్జెన్సీ అనే ఆప్షన్ ఉందని.. దాన్ని నొక్కితే దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుందని తెలిపారు. దీంతో పాటే పోలీస్ కమాండ్ సెంటర కు, క్యాబ్ కు దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ వెహికిల్స్ కు, క్యాబ్ కంట్రోల్ రూంకు, ప్రయాణికుల బంధువులకు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుందని చెప్పారు. పోలీస్ సిస్టమ్ అలర్ట్ అయి ఆపదలోవున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు వీలవుతుందని చెప్పారు.

Latest Updates