పోలీస్ విధుల్లో జాగిలాలది కీలక పాత్ర: డీజీపీ

dgp thakur says about sniffer dogs at mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి APSP బెటాలియన్ లో పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధ్వర్యంలో జాగిలాలకు ప్రత్యేక  శిక్షణ ముగిసింది. 18వ బ్యాచ్ కింద 30 జాగిలాలకు వివిధ అంశాల్లో అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా డీజీపీ ఠాకూర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పోలీస్ విధుల్లో సిబ్బందే కాదు.. జాగిలాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయన్నారు.  సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడంలో జాగిలాలు పని తీరు అభినందనీయమన్నారు. ఆధారాలు లేని ఎన్నో కేసులను కూడా పోలీసులు జాగిలాల కారణంగా చేధించారని, బాంబులను పసిగట్టి, నిర్వీర్యం చేసేందుకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని డీజీపి అన్నారు. సమాజంలో ప్రజల భద్రతలో పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుందని అన్నారు.  జాగిలాలకు  మంచి శిక్షణ అందించిన వారికి డీజీపీ తన  అభినందనలను తెలిపారు.

Latest Updates