ఎంపీపీ పై బీరు బాటిల్ తో దాడి చేసిన దాబా యజమాని

వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం ఎంపిపి నల్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి పై ఓ దాబా యజమాని బీర్ బాటిల్ తో దాడి చేశాడు.  ఈ ఘటనలో ఎంపీపీకి తీవ్రంగా గాయాలయ్యాయి.  వివరాల్లోకి వెళితే..  ఎంపిపి నల్లోళ్ల  శ్రీనివాస్ రెడ్డి  శనివారం రాత్రి 10 గంటల సమయం లో తన అనుచరులతో కలిసి తన గ్రామానికే చెందిన  చేకూరి శ్రీనివాస్ రెడ్డి దాబాలోకి వెళ్ళాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దాబా యజమానికి, ఎంపీపీ కి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ క్రమంలో కోపం పట్టలేని దాబా యజమాని  బీరు బాటిల్ తో ఎంపీపీ పై బలంగా నుదుటిపై కొట్టాడు. ఆ దెబ్బకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంట ఉన్న అనుచరులు అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని డెక్కన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంపీపీ పరిస్థితి నిలకడగా ఉందని అతని బంధువులు, కుటుంబీకులు చెబుతున్నారు.

Latest Updates