వారణాసిలో పోటీ చేస్తోంది TRS కార్యకర్తలే: ధర్మపురి అర్వింద్‌‌

‘వారణాసిలో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదు. వాళ్లంతా ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ తరఫున పనిచేసిన కార్యకర్తలే’నని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ బుధవారం ఆరోపించారు. ఇది నిజామాబాద్‌ టీఆర్‌‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత ‘సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీ’ అని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే వారణాసిలో నామినేషన్లంటూ కొత్తపబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారన్నారు. పసుపు రైతులపై నిజంగా ప్రేముంటే బోనస్‌ ఎందుకు ఇప్పించలేదని నిలదీశారు. జిల్లాకు రావాల్సిన నీటిని మళ్లిస్తే అడ్డుకోలేని కవిత , 20 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తే అడ్డుకొని కేసులు పెట్టించారని మండిపడ్డారు.

Latest Updates