మెదక్, హైదరాబాద్ తప్ప 15 సీట్లు బీజేపీవే : ధర్మపురి అర్వింద్

dharmapuri-arvind-on-vivek-joining-bjp-269397-2

తెలంగాణలో 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక్క మెదక్, హైదరాబాద్ తప్ప మిగిలిన 15 స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని చెప్పారు. హరీష్ రావు ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి.. ఆయన పనితనం బాగుంది కాబట్టి… మెదక్ ఒక్కటి టీఆర్ఎస్ గెలవొచ్చని చెప్పారు. అనుభవజ్ఞుడు వివేక్ వెంకటస్వామి చేరికతో బీజేపీ మరింత బలపడిందన్నారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో లక్ష్మణ్, వివేక్, కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు ధర్మపురి అర్వింద్. మొత్తం 15 ఎంపీ సీట్లు గెలిచి మోడీకి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు అర్వింద్.

Latest Updates