నిన్న ఉన్న సోయి.. సమ్మె కాలంలో ఏమైంది

  • ఆర్టీసీపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు
  • తెలంగాణ హోం మంత్రి డమ్మీ: ఎంపీ ధర్మపురి అరవింద్

సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో వ్యవహరించిన తీరు వింతగా ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆర్టీసీ విషయంలో యూటర్న్ తీసుకున్నారని అన్నారు. నిన్న కార్మికులతో లంచ్ మీటింగ్‌లో ఉన్న సోయి.. సమ్మె కాలంలో ఎటు పోయిందని ప్రశ్నించారాయన. సమ్మె చేస్తున్నప్పుడే స్పందించి ఉంటే ఇటు కార్మికుల ప్రాణాలు నిలిచేవని, అటు ప్రజలు ఇబ్బందిపడేవారు కాదని అన్నారు అర్వింద్. నిన్నమొన్నటిదాకా పనికిరారు అన్న ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు సడన్‌గా ఎలా పనికొచ్చేవాళ్లయ్యారని ప్రశ్నించారారు. కేసీఆర్ కళ్లు నెత్తినెక్కించుకొని మాట్లాడుతున్నారని, ఆయనకు కనీసం కేబినెట్ సమావేశాలు నిర్వహించే తీరిక కూడా లేదని అన్నారు.

మీ నిర్లక్ష్యానికి ఎంతమంది బలికావాలి

తెలంగాణలో కష్టంలో ఉన్నవాళ్ల కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకునే పరిస్థితి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్. షాద్ నగర్ దిశ ఘటనలో పోలీసుల అలసత్వం ఉందన్నారు. ఈ నిర్లక్ష్యం మూలంగా ఇంకా ఎంత మంది బలికావాలని ప్రభుత్వాన్ని నిలదీశారాయన. తెలంగాణ హోంమంత్రి వట్టి డమ్మీ అని, దిశ కేసును తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కేటీఆర్ చెప్తున్నారంటే హోంమంత్రి దద్దమ్మనా? ఇదేమన్నా రాచరికమా అని ప్రశ్నించారు అర్వింద్. డమ్మీలను ఎందుకు కీలక పదవిలో పెట్టారో చెప్పాలన్నారు.

MORE NEWS:

సమ్మె విరమణ తర్వాత.. ఆర్టీసీ కార్మికుల భేటీలో సీఎం కేసీఆర్ వరాల జల్లు

ఆర్టీసీ బస్సు చార్జీల వడ్డన.. కొత్త టికెట్ రేట్లు ఇవీ

Latest Updates