ఉద్యోగాల కోసం సీఎం ఇంటి ముందు ధర్నా

పంజాబ్ లో టీచర్ ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పటియాలా లోని సీఎం అమరీందర్ సింగ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఎలిమెంటరీ టీచర్ ట్రెయినింగ్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయినా… ఇప్పటివరకూ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. దీంతో ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. మహిళలను కూడా అక్కడ్నుంచి ఈడ్చుకెళ్లారు.

 

Latest Updates