సూపర్బ్ ఓపెనింగ్ : ధావన్, రోహిత్ హాఫ్ సెంచరీలు

వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు సూపర్బ్ ఓపెనింగ్ ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి నుంచి ధావన్, రోహిత్ ఆచితూచి ఆడుతూ… సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. 19 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయి దాటించారు. 21 ఓవర్ కల్లా స్కోరును 120 దాటించారు. 

ఈ క్రమంలో ధావన్ మొదట హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన ధావన్ 54 బాల్స్ లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా 50 పూర్తిచేశాడు. 61 బాల్స్ లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేశాడు. 

 

Latest Updates