గబ్బర్ ఈజ్ బ్యాక్ : శిఖర్ ధావన్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ జోరు చూపిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 95 బాల్స్ లోనే 100 పరుగులు పూర్తిచేశాడు. 13 ఫోర్లతో సెంచరీ కొట్టాడు శిఖర్ ధావన్. వరల్డ్ కప్ లో తానెప్పుడూ కీలకమేనని మరోసారి నిరూపించాడు శిఖర్ ధావన్.

టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ తీసుకుంది. రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ శుభారంభం అందించాడు. ఇద్దరూ 22.3 ఓవర్లలో 127రన్స్ భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ 57 రన్స్ చేసి ఔటయ్యాడు. ధావన్ కు జతగా కోహ్లీ క్రీజులో ఉన్నాడు. 2వ వికెట్ కు 51 బాల్స్ లోనే 50 రన్స్ జోడించారు కోహ్లీ, ధావన్.

Latest Updates