మంచి మనసు చాటుకున్న ధావన్ కూతురు

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ పెద్ద కూతురు ఆలియా  పెద్ద మనసు చాటుకుంది. క్యాన్సర్‌‌ బాధితులకు సాయం చేయడం కోసం తన జుట్టును దానం చేసింది. అంతేకాదు తన బాయ్‌‌ఫ్రెండ్‌‌, చెల్లితో కూడా ఈ పని చేయించి శభాష్‌‌ అనిపించుకుంది. ఈ విషయాన్ని సోషల్‌‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌‌తో పంచుకున్న ధవన్‌‌.. తన కూతురు చేసిన పనికి గర్వపడుతున్నానని చెప్పాడు. అలియా రెండు ఫొటోలను శిఖర్‌‌ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో షేర్‌‌ చేశాడు. మొదటి ఫొటోలో తన పెంపుడు కుక్కను ఎత్తుకొని నిండైన జట్టుతో ఉన్న ఆలియా.. రెండో ఫొటోలో జట్టు లేకుండా కనిపించింది. చిన్న వయసులోనే ఆలియా చూపిన ఔదార్యాన్ని ధవన్‌‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Latest Updates