ధోని,కోహ్లీ టీమ్ స్పిరిట్ పెంచారు: గవాస్కర్

టీమ్‌ ‌‌‌స్పోర్ట్స్  అంటే… ప్లేయర్ల మధ్య బ్యాటింగ్. జట్టులో మంచి కల్చర్‌‌‌‌ ఉండాలి. టీమిండియాలో ఈ రెండింటినీ పెంచడంలో మాజీ కెప్టెన్‌‌‌‌ మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌‌‌‌ కోహ్లీ కీలక పాత్ర పోషించారని లెజెండరీ క్రికెటర్‌ ‌‌‌సునీల్‌‌‌‌ గావస్కర్‌‌‌‌ అన్నా డు. ప్రస్తుతం ఇండియా టీమ్‌‌‌‌లో ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. టీమ్‌‌‌‌లో యంగ్‌ ‌‌‌స్టర్స్ ‌‌‌ను ఈ ఇద్దరూ ట్రీట్‌‌‌‌ చేసే విధానం కూడా చాలాబాగుంటుందని మెచ్చుకున్నా డు. ‘మన జట్టులో టీమ్‌‌‌‌ స్పిరిట్‌‌‌‌ పెంచింది మహీ, కోహ్లీయే. బాగా రాణించిన ఆటగాళ్ల ను అద్భుతంగా గౌరవిస్తారు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్‌‌‌‌ లో జరిగిన మ్యాచ్‌‌‌‌ల్లో సత్తాచాటిన ప్లేయర్లను ఇండియా టీమ్‌‌‌‌ గౌరవించే విధానం కూడా బాగుంది. స్వదేశంలో ఇంటర్నేషనల్‌ ‌‌‌మ్యాచ్‌‌‌‌లు ఆడే టైమ్‌‌‌‌లో రెండు టీమ్‌‌‌‌లు స్పెషల్‌ ‌‌‌చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్స్‌ ‌‌లో ఒక వేదిక నుంచి మరో వేదికకు కలిసే ప్రయాణిస్తాయి. అదే విమానంలో టీవీ టెక్నికల్ సిబ్బంది కూడా తమ కేబుల్స్, ఇతర పరికరాలతో వస్తారు. అలాంటప్పుడు విమానంలో లిమిటెడ్ బిజినెస్ క్లాస్‌‌‌‌ సీట్లలో కెప్టెన్లు , కోచ్‌‌‌‌లు, మేనేజర్లు కూర్చుంటారు. అయితే ముందు మ్యాచ్‌‌‌‌లో బాగా ఆడిన ఇండియన్‌ ‌‌‌ప్లేయరను ఎకానమీ క్లాస్‌‌‌‌ లో కాకుండా బిజినెస్‌ ‌‌‌క్లాస్ సీట్లలో కూర్చోబెట్టి గౌరవిస్తుంటారు. అందుకోసం కెప్టెన్, సీనియర్ ప్లేయర్లు తమ సీట్లను ఇచ్చేస్తారు. కెప్టెన్‌‌‌‌ గా ఉన్నప్పుడు కూడా ధోనీ బిజినెస్‌‌‌‌ క్లాస్‌‌‌‌ వాడిన సందర్భాలు చాలా అరుదు. అతను టీవీ కవరేజ్ సిబ్బంది, కెమెరామెన్, సౌండ్ ఇంజనీర్ల పక్కన కూర్చునేవాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే. ముగిసిన మ్యాచ్‌‌‌‌లో బాగా బౌలింగ్‌‌‌‌ చేసి టీమ్‌‌‌‌ను గెలిపించిన బౌలర్లకు బిజినెస్ క్లాస్‌‌‌‌ సీట్లు ఇచ్చేసి తాను ఎకానమీ సెక్టార్లో వచ్చేవాడు. ఇవన్నీ చిన్నత్యాగాలే కానీ, లాంగ్‌‌‌‌ వేలో టీమ్‌‌‌‌ స్పిరిట్ పెంచడంలో కీలకం అవుతున్నాయి. దీంతో పాటు ప్లేయర్ల మధ్య మంచి బాండింగ్‌‌‌‌ కూడా నెలకొంటుంది’ అని ఓ కాలమ్‌‌‌‌లో సన్నీ రాసుకొచ్చాడు.

Latest Updates