ధోనీకి రెస్ట్ ఇస్తే..CSK ఢమాలే..!: హస్సీ

చెన్నై : IPL ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో టాప్ లోనే కోనసాగుతుందంటే..అందుకు కారణం మిస్టర్ కూల్ ధోనీనే అనేది అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న ధోనీకి రెస్ట్ అవసరం. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ లో ధోనీ రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ లో CSK ఓడిపోయింది. దీంతో ధోనీ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే CSK కోచ్‌ మైఖెల్‌ హస్సీ మాట్లాడాడు. ‘ధోని అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ, అది అంత తీవ్రమైందేమి కాదు. ఒక్క మ్యాచ్‌ నుంచి కూడా రెస్ట్ తీసుకోవాలనుకోవట్లేదని ధోనీనే చెప్పాడు. ప్రస్తుతం ధోనీ వందశాతం ఫిట్‌ గా ఉన్నాడు. అందుకే ఈ సీజన్‌ లో ధోనీ బ్యాట్‌ తోనూ బాగా రాణిస్తున్నాడు. చెన్నైకి ఆడటాన్ని ధోని ఆస్వాదిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ధోనీకి బ్యాటింగ్ రాకపోయినా ఫర్వాలేదు కానీ..అతడు గ్రౌండ్ లో ఉంటే చాలు. ఓడాల్సిన మ్యాచ్ ను గెలిపిస్తాడు. ధోనీ లేకపోతే CSK లేదు” అని తెలిపాడు హస్సీ.

శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌ తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఇప్పటి వరకూ ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌ కు చేరుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది.  ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్‌  తప్పక గెలిచి తీరాలి.

 

 

Latest Updates