ధోని మరీ అంత కూల్ కాదు: గంభీర్

న్యూఢిల్లీ: వరల్డ్ క్రికెట్ లో గ్రౌండ్ లోపల, వెలుపలా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని ఎంఎస్ ధోనీకి మంచి పేరుంది. అందుకు తగ్గట్లే ఒత్తిడి సమయాల్లోనూ కామ్ గా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకొని టీమిండియాకు ధోని ఎన్నో విజయాలు అందించాడు. అందుకే ధోనీని మిస్టర్ కూల్, కెప్టెన కూల్ ధోని అని పిలుస్తుంటారు. అయితే ప్రజలకు తెలిసినట్లుగా ధోని మరీ అంత కూల్ కాదని, అతడు కూడా తన ప్రశాంతతను అప్పుడప్పుడు కోల్పోయేవాడని మెన్ ఇన్ బ్లూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు.

‘ధోని తన కూల్ నెస్ ను కోల్పోవడం కొన్నిసార్లు చూశా. అది 2007 వరల్డ్ కప్. ఆ టోర్నీలో మేం సరిగ్గా ఆడలేదు. అతడు కూడా మనిషే. అతడి విషయంలోనూ స్పందించడం అనేది సహజమే. అందులో ఎలాంటి తప్పూ లేదు. సీఎస్ కే ఆడుతున్నప్పుడు మిస్ ఫీల్డ్స్ జరిగినప్పుడు లేదా ఎవరైనా క్యాచ్ వదిలేసినప్పుడు ధోని ప్రశాంతతను కోల్పోయేవాడు. అవును అతడు కూల్. మిగిలిన కెప్టెన్లతో పోల్చుకుంటే అతడు చాలా కూల్. అలాగే ధోని నా కంటే చాలా చాలా కూల్’ అని గౌతీ పేర్కొన్నాడు.

Latest Updates