రిటైర్మెంట్ ఆలోచన లేదు.. ఆర్మీ కోసం విండిస్ టూర్ కు దూరం ..!

dhoni-serves-his-army-regiment-for-next-2-months

టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎమ్ ఎస్ ధోనీ విండిస్ టూర్ కు అందుబాటులో ఉండటం లేదని తెలిపారు బీసీసీఐ అధికారులు. ఇది ధోనీ సొంత నిర్ణయమని చెప్పారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు  అనుకున్నారు. అయితే ఈ అంచనాలకు పులిస్టాప్ పెట్టాడు ధోనీ. తాను రానున్న రెండు నెలలు భారత ఆర్మీతో గడపనున్నట్లు చెప్పారు. దీంతో తాను కరేబియన్ పర్యటణకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐకు తెలిపాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీకి, సెలక్షణ్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పామని బీసీసీఐ అధికారులు తెలిపారు.  ధోనీ తప్పుకోవడంతో రిషబ్ పంత్ కు మూడు ఫార్మాట్ లలో ఆడే అవకాశం రానుంది.

Latest Updates