పానీపూరి వడ్డిస్తున్న ధోని .. వీడియో వైరల్

మిస్టర్ కూల్  టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం  ఏం చేస్తున్నాడు అనే సందేహం కల్గుతుంది. అయితే ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు దూరమైన ధోని ప్రస్తుతం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవుల్లో  ఎంజాయ్ చేస్తున్నాడు. లేటెస్గ్ గా ధోనీ పానీ పూరి వడ్డిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పానీ పూరి స్టాల్ దగ్గర  ధోనితో పాటు పానీ పూరి అమ్మే సిబ్బంది కౌంటర్ వైపు, భారత వెటరన్ ఆటగాళ్లు ఆర్పీసింగ్, పియూష్ చావ్లా మరో వైపు నిలబడి ఉన్నారు. ధోని పానీ పూరిలో చెంచాతో బఠానీ, ఉల్లిపాయలు అన్నికలిపి ఆర్పీసింగ్, చావ్లాకు వడ్డించాడు. దీనికి ఆర్పీ సింగ్ వంగి ధోనికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ధోని ఆల్ రౌండర్ అన్ని పనులు వస్తాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates