మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన ధోని.. రోజంతా ప్రాక్టీస్

బీసీసీఐ ఝలక్ ఇచ్చిన వెంటనే  టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. ఈ సారి ఐపీఎల్ లో సత్తాచాటేందుకు ట్రై చేస్తున్నాడు. ఇందు కోసం ధోని ఝార్ఖండ్ రంజీ టీంతో ప్రాక్టీస్ చేశాడు.  సడెన్ గా ధోని ప్రాక్టీస్ కు రావడంతో  రంజీ ప్లేయర్స్ అంతా ఆశ్చర్యపోయారు. చాలా సేపు ధోనీ బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ప్లేయర్స్ రెడ్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తే ..ధోనీ వైట్ బాల్ తో ప్రాక్టీస్ చేశాడు.   రోజూ ట్రైనింగ్ కు వస్తాడని జార్ఘండ్ క్రికెట్ సంఘం తెలిపింది. ధోనీ రాక మిగతా ఆటగాళ్లకు ఉత్సా హాన్ని నింపిందన్నారు.ఇటీవల బీసీసీఐ కాంట్రాక్టులో ధోనీ పేరు లేకుండా లిస్ట్ రిలీజ్ చేసింది. దీంతో చాలా మంది ధోనీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. త్వరలోనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

see also: రోహిత్ మరో వరల్డ్ రికార్డ్..

Latest Updates