విరాట్ ఆగమన్నాడు..ధోనీ ఆగిండు!

  • రిటైర్మెంట్ ను పక్కనబెట్టిన మహీ
  • టీ20 ప్రపంచకప్ వరకు జట్టుతో పాటే
  • రిషబ్ కు మెంటార్ గా,టీమ్ కు గైడ్ గా
  • ఎవరూ ఊహించని విధంగా, అందరూ శభాష్ అనే విధంగా.. టీమిండియా ‘నయా దేవుడు’మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ను పక్కనబెట్టా డు. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఆడిందే చివరి మ్యాచ్ అని వార్తలు, కథనాలు హల్ చల్ చేసినా.. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ మరో ఏడాది ఆటలో కొనసాగా లని కోరుకుంటున్నా డు. అయితే రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు జట్టుకు అవసరమైనప్పుడు తన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నా డు. ప్రపంచ క్రికెట్ మొత్తం తన రిటైర్మెం ట్ పై ఆందోళనగా ఉన్న వేళ.. ధోనీ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? బిహైండ్ ది స్క్రీన్ ఏం జరిగింది? వరల్డ్ కప్ ఓటమి తర్వాత‘పెద్ద’తలకాయల మధ్య జరిగిన చర్చలేంటి? అన్న ప్రశ్నలకు లభిస్తున్న ఏకైక సమాధానం విరాట్ కోహ్లీ ..!

ఒప్పుకోని కోహ్లీ…

వాస్తవానికి వరల్డ్ కప్ తర్వాత వీడ్కోలు పలకాని నిశ్చయించుకున్న ధోనీ.. ఈ విషయాన్ని తనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన సహచరులకు చెప్పాడు. తన భవిష్యత్ ప్రణాళికలపై కూడా పూర్తి స్పష్టత ఇచ్చాడు. ఈవిషయాన్ని పసిగట్టిన విరాట్ ఓ సందర్భంలో మహీతో వీడ్కోలు అంశంపై చర్చించాడని కెప్టెన్ సన్నిహి తుడు ఒకరు వెల్లడించాడు.ఇప్పటికిప్పుడు రిటైర్ కావొద్దని, మరికొన్నాళ్లు టీమ్ కు సేవలందించాలని కోరినట్లు తెలుస్తున్నది. మొత్తానికి రిటైర్మెంట్ అంశాన్ని పునరాలోచించాలని విరాట్ గట్టిగా కోరడంతో మహీ వెనకడుగు వేశాడని సమాచారం. ‘ఇంత అత్యవసరంగా రిటైర్మెంట్ తీసుకోవద్దని కోహ్లీ కోరడంతోనే ధోనీ ఆ అంశాన్ని పక్కనబెట్టా డు. తర్వాత మనసు మార్చుకు ని ఏడాది పాటు కొనసాగాలని నిర్ణయించుకున్నా డు’ అని కోహ్లీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పరిగణనలోకి ఆ మూడు అంశాలు…

ధోనీ రిటైర్మెంట్ ను ఆపడానికి కోహ్లీ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకు న్నట్లు తెలుస్తున్నది. ఒకటి.. ధోనీకి పెద్దగా ఫిట్ నె స్ సమస్యలు లేవు.టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగే సామర్థ్యం అతనిలోఉంది. రెండో ది.. మూడు ఫార్మాట్లలో సెలెక్టర్ల ఫస్ట్​చాయిస్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో గాడిలో ప డే వర కు ధోనీ పర్యవేక్షణ అవసరం.మూడోది.. ఒకవేళ పంత్ గాయపడినా, ఫామ్ కోల్పోయినా ప్రత్యామ్నాయంగా ధోనీ జట్టులోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు. తక్షణంగా సేవలందించేందుకు మహీకి ఎలాంటి సమస్యలు ఉండబోవు. ఈ మూడు లాజిక్ లను దృష్టిలో పెట్టుకుని విరాట్ ధైర్యం గా బోర్డులోని ‘పెద్ద తలకాయలతో’ చర్చించిన ట్లు క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నా యి. అందుకే కరీబియన్ టూర్ కు టీమిండియా ఎంపిక సందర్భంగా కూడా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. ధోనీ రిటైర్మెంట్ అంశంపై చాలా తేలికగా స్పందించాడు. మొత్తానికి టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో ధోనీ భాగం కాకపోయినా.. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యాఅతను జట్టుతో పాటే కొనసాగబోతున్నా డు. విండీస్ టూర్ తర్వాత జరిగే టోర్నీలకు ఎంపిక చేసే 15 మందిలో ఉంటా డు.. కానీ11 మందిలో ఆడడు అన్న మాట.

ఓకే కీపర్…

వరల్డ్ కప్ లో ముగ్గురు వికెట్ కీపర్లతో టీమిండియా మ్యాచ్ ఆడింది. కానీ ఇప్పుడు ఒక్క కీపర్ కే కట్టుబడాలని సెలెక్టర్లు భావిస్తున్నా రు. దీంతో వెటరన్ దినేశ్ కార్తీక్ కు దాదాపుగా తలుపులు మూసేశారు. ఫలితంగా పంత్ కు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని యోచిస్తున్నా రు. వృద్ధిమా న్ సాహాతో పాటు 24 ఏళ్ల సంజూ శాంసన్ , 21 ఏళ్ల ఇషాన్ కిషన్ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. ‘పెద్ద టోర్నీల్లో ధోనీ అనుభవం ముందు వీళ్లందరూతక్కు వే. కాబట్టి మహీ విలువ ఎప్పటికీ తగ్గదు. అతను ఇచ్చే సలహాలు, సూచనలను కోహ్లీ కూడా బాగా స్వాగతిస్తాడు. అందుకే టీమ్ కుదురుకునే వరకు ధోనీ ఉండటం చాలా అవసరమని కెప్టెన్ భావిస్తున్నాడు’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఎలాగూ వచ్చే ఐపీఎల్ లో ధోనీ సీఎస్ కే కు ఆడతాడు కాబట్టి మ్యాచ్ ఫిట్ నె స్ సమస్యలు కూడా ఎదురుకావు. వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. అంటే ఐపీఎల్ కు ఈ టోర్నీకి మధ్య నాలుగు నెలల గ్యాప్ ఉంటుంది. కాబట్టి మేనేజ్ మెంట్ ధోనీ సేవలను కోరుకుంటే అతన్ని కొనసాగించడం పెద్ద కష్టం కాదు.

Latest Updates