వరల్డ్ కప్ లో ధోనీనే బిగ్ ప్లేయర్ : రవిశాస్త్రి

dhoni-will-be-a-big-player-in-world-cup-says-ravi-shastri

ముంబైలో స్కిప్పర్ మీడియాతో మాట్లాడారు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. ప్లేయర్లు సత్తా మేరకు ఆడితే.. ప్రపంచకప్ మళ్లీ ఇండియాకు వస్తుందని అన్నారాయన. “ప్రపంచకప్ అనేది ప్రతిభకు వేదిక. ఐతే.. ఆ వేదికను ఆనందిస్తూనే పోటీ పడాలి. ప్రపంచకప్ టోర్నీ అనేది భారీ సమరం. బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ కూడా 2015లో ఉన్నట్టుగా ఇపుడు లేవు” అన్నారు రవిశాస్త్రి.

“ఎమ్మెస్ ధోనీ చాలా పెద్ద రోల్ పోషించబోతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డేల్లో ధోనీ స్థానంలో మరో బెటర్ ఆటగాడు లేడు. గేమ్ ను తక్కువ టైమ్ లో మార్చాలనుకునే ప్రత్యేక సందర్భాల్లో అయితే.. ధోనీని మించినవారు లేరు. వరల్డ్ కప్ లో ధోనీ బిగ్ ప్లేయర్ కాబోతున్నాడు” అని చెప్పాడు రవిశాస్త్రి.

Latest Updates