షుగర్ ట్రీట్మెంట్ ఇక చౌక

డయాబెటీస్ చికిత్సలో ఉపయోగించే సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్‌‌‌‌పోర్టర్-2(ఎస్‌‌‌‌జీఎల్‌‌‌‌టీ 2) ఇన్హిబిటర్స్​లో ఒకటైన రెమోగ్లిఫ్లోజిన్‌‌‌‌ను  గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండియా మార్కెట్‌‌‌‌లోకి విడుదల చేసింది. ఈ డ్రగ్‌‌‌‌ను ‘రెమో’, రెమోజెన్’ బ్రాండ్ల కింద విడుదల చేస్తున్నట్టు గ్లెన్‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇండియా ఫార్ములేషన్స్ ప్రెసిడెంట్ సుజేష్ వాసుదేవన్ చెప్పారు. ఈ డ్రగ్‌‌‌‌ను పెద్ద వారిలో టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం వాడతారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెమోగ్లిఫ్లోజిన్‌‌‌‌ను విడుదల చేసిన తొలి కంపెనీగా గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌ నిలువనుందని.. ఈ డ్రగ్‌‌‌‌ యాక్సస్ పొందే తొలి దేశం కూడా మనదేనని తెలిపారు. పూర్తిగా ఈ డ్రగ్‌‌‌‌ను మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌‌‌‌గా మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు సుజేష్ చెప్పారు.  ఈ డ్రగ్ వల్ల రోజుకు అయ్యే ఖర్చు కేవలం ఇరవై ఐదు రూపాయలేనని, ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో అందుబాటులో ఉన్న ఎస్‌‌‌‌జీఎల్‌‌‌‌టీ2 ఇన్హిబిటర్లతో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకే లభ్యమవుతున్నట్టు సుజేష్ చెప్పారు. రెమోగ్లిఫ్లోజిన్ ద్వారా డయాబెటీస్ రోగులు ఎస్‌‌‌‌జీఎల్‌‌‌‌టీ 2 ఇన్హిబిటర్లపై ఏడాదికి రూ.11వేల వరకు ఆదా చేసుకోవచ్చని కూడా తెలిపారు. ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం రెమోగ్లిఫ్లోజిన్ ఎటాబోనెట్ 100 ఎంజీ టాబ్లెట్లకు రెగ్యులేటరీ నుంచి అనుమతి లభించినట్టు సుజేష్ చెప్పారు. గ్లైసిమిక్ కంట్రోల్, గుండెకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించడం వంటి వాటిని ఈ డ్రగ్ అందిస్తుంది. ‘గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌కు డయాబెటీస్ కీ ఫోకస్. రెమోగ్లిఫ్లోజిన్ లాంచ్‌‌‌‌తో కంపెనీ ఇండియాలోని పేషెంట్లకు వరల్డ్ క్లాస్ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందివ్వనుంది. అంతేకాక ఎస్‌‌‌‌జీఎల్‌‌‌‌టీ 2 ఇన్హిబిటర్ల యాక్సస్‌‌‌‌ను మరింత మెరుగపర్చనుంది’ అని సుజేష్ చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతోన్న కంపెనీగా గ్లెన్‌‌‌‌మార్క్ ఉందని, గ్లోబల్‌‌‌‌గా కంపెనీకి వార్షిక టర్నోవర్ రూ.9,103 కోట్లుగా ఉందన్నారు. ఇండియా రెవెన్యూలు 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.2514 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 శాతం నుంచి 14 శాతం వరకు వృద్ధిని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. టాప్ 20 ఇండియా ఫార్మా ప్లేయర్స్‌‌‌‌లో గ్లెన్‌‌‌‌మార్క్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. గ్లోబల్‌‌‌‌గా 17.1 కోట్ల మంది డయాబెటీస్ పేషెంట్లు ఉండగా.. వారిలో 7.2 కోట్ల మంది ఇండియాలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సంఖ్య 2045 నాటికి రెండింతలు పెరుగుతోందని అంచనావేశారు. ఎస్‌‌‌‌జీఎల్‌‌‌‌టీ 2 ఇన్హిబిటర్లను గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌ ఇండియాలో మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టింది.

Latest Updates