100కి 3 రోజుల్లోనే 6.4 లక్షల కాల్స్‌

లాక్ డౌన్ తో జ‌న జీవ‌నం ఎక్క‌డిక‌క్క‌డే స్తంభించిన క్ర‌మంలో ఎమ‌ర్జెన్సీగా డ‌య‌ల్ 100 ఒక్క‌టే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టంతో విఫ‌రీతంగా కాల్స్ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డయల్‌ 100కి మూడు రోజుల్లోనే 6.4 లక్షల కాల్స్‌ వచ్చాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆప‌ద‌కాలంలో క‌రోనాపై ప్ర‌జ‌ల‌కున్న అనుమానాల‌ను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని తెలిపారు.

కొన్నిచోట్ల తీవ్ర‌జ్వ‌రం వ‌చ్చిన‌వారు 100కి కాల్ చేసినా .. పోలీస్ వాహ‌నాల్లోనే హాస్పిట‌ల్ కి త‌ర‌లించామ‌న్నారు. కొంద‌రు సోష‌ల్ డిస్టెన్స్ పాటించని వారిపై ఫిర్యాదు చేశారని, అలాగే ఫిర్యాదు దారులు కరోనా వైరస్ అనుమానితుల సమాచారం ఇచ్చారన్నారు. ప్రజలంతా సోష‌ల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు.. పోలీసులకు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు డీజీపీ.

Latest Updates