10 కంటే 19 చిన్ననంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని మాకు తెలీదే

  • బీజేపీని ఎగతాళి చేసిన చిదంబరం

న్యూఢిల్లీ: బీజేపీ బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల మేనిఫెస్టోలో 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. 10 కంటే 19 సంఖ్య తక్కువని మాకు తెలియదే అని ఎగతాళి చేశారు. 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ ప్రకటిస్తే విమర్శించిన ఎన్డీయే ఇప్పుడు 19లక్షలు ఇస్తామని ఎలా ప్రకటించిందని ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. “ 10లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఆర్జేడీపై విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు 19లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 10 కంటే 19 తక్కువ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని నాకు తెలియలేదు. దేశంలో ఆర్థిక వృద్ధి లేదని ఎకానమిస్టులు చెప్తున్నారు. మెరుగుపరిచేందుకు కూడా ఇబ్బందే అంటున్నారు” అని బీజేపీపై చిదంబరం తీవ్ర కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశారు.

కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే.. కశ్మీర్​ దూరమైతది

Latest Updates