ప్లాట్‌ కొనడానికి సుశాంత్ డబ్బును వాడలేదు!

ఈడీ విచారణలో రియా చక్రవర్తి వెల్లడి!
ముంబై: బాలీవుడ్ సెలబ్రిటీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. జూన్ 14న చనిపోయిన సుశాంత్‌ డెత్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఈ నేపథ్యంలో రియాను ఈడీ సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిందని సమాచారం. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా సుశాంత్ డబ్బును తాను వాడలేదని, బ్యాంక్‌ లోన్‌తోనే ప్లాట్ కొన్నానని విచారణలో రియా చెప్పిందని తెలిసింది. ఈడీ ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఖర్ (ఈస్ట్‌)లో రూ.85 లక్షల విలువ చేసే ప్లాట్‌ను బ్యాంక్ లోన్‌తో పాటు తన సేవింగ్స్‌లోని రూ. 25 లక్షలు కలిపి తీసుకున్నట్లు రియా చెప్పారని సమాచారం. మిగతా డబ్బును ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తున్నట్లు తెలిపింది.

సుశాంత్ డబ్బులను తన సొంత ఖర్చుల కోసం వాడలేదని రియా స్పష్టం చేసినట్టు సమాచారం. సుశాంత్‌తో కేవలం రెండు కంపెనీలకు మాత్రమే తాను డైరెక్టర్‌‌గా ఉన్నానని ఆమె తెలిపినట్లు తెలిసింది. మరిన్ని విషయాల్లో స్పష్టత కోసం రియాను ఈడీ మరోమారు విచారించే అవకాశం ఉంది. ‘ఆమెను విచారించి, స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారు. రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి స్టేట్‌మెంట్స్‌ను కూడా తీసుకున్నారు. ఐటీ రిటర్న్స్‌తో సహా వారి దగ్గర అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నాయి. మరోసారి పిలిస్తే నిర్ణీత టైమ్‌కు ఆమె హాజరవుతారు’ అని రియా తరఫు అడ్వకేట్ సతీష్ మనేషిండే చెప్పారు.

Latest Updates