హైవేపై పల్టీ కొట్టిన డీజిల్ ట్యాంకర్

రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ పల్టీ కొట్టింది. ట్యాంకర్ ఫుల్ లోడ్ తో ఉండటంతో మొత్తం డీజిల్ లీక్ అయింది. కొద్దిసేపు రోడ్డుపై వరద నీటిలా డీజిల్  ప్రవహించింది. ప్రమాదం గుర్తించిన పోలీసులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. డీజిల్ ట్యాంకర్ కు మంటలు రేగితే ప్రమాదమని భావించి వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీంతో చాలాసేపు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చాక.. ముందు జాగ్రత్త చర్యలతో ట్యాంకర్ ను ఖాళీ చేయించి.. పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దూరం నుండి ప్రజలందరూ ఏం జరుగుతుందోనని భయం భయంగా గమనిస్తూ ఉండడంతో ఉత్కంఠ ఏర్పడింది.

Latest Updates