డైటింగ్ తో అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే..!

మీల్ రీప్లేస్ మెంట్స్, షేక్స్ పేరుతో సప్లిమెంట్స్ అందిస్తున్న కంపెనీల్లో చాలా వరకు సర్టిఫైడ్ కాదు. మనదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60-70 శాతం డైటరీ సప్లిమెంట్స్‌‌‌‌ మోస పూరితమైనవి అని కొన్ని సర్వేల్లో తేలింది. అయినప్పటికీ రోజుకో కొత్తరకం డైట్‌‌‌‌ రీప్లేస్​మెంట్‌‌‌‌ వస్తూనే ఉంది. అందుకే గుడ్డిగా వాటిని తీసుకోకుండా.. డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.

నిన్న మొన్నటిదాకా ప్రతీ ఒక్కరి ఫుడ్ స్టైల్ ఒకేలా ఉండేది. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్‌‌‌‌లో ఇడ్లీ, దోశె లాంటి టిఫిన్స్.  మధ్యాహ్నం, రాత్రి అన్నంతో  భోజనం. ఇదే దాదాపుగా అందరూ తినేది. కానీ రానురాను ఈ విధానం మారిపోతోంది. ఫుడ్ హ్యాబిట్స్‌‌‌‌లో ఎన్నో మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా సిటీ లైఫ్‌‌‌‌లో రోజుకో కొత్త డైట్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ‘మీల్ రీప్లేస్‌‌‌‌మెంట్ డైట్’ వచ్చింది. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవాళ్లు  భోజనాన్ని మానేసి దాని బదులు షేక్స్, ఫుడ్ సప్లిమెంట్స్,  ఇతర జంక్ ఫుడ్స్‌‌‌‌తో  పొట్ట నింపేసుకుంటున్నారు. అసలు ఈ అలవాటు ఎంతవరకు మంచిది?

ఈ రోజుల్లో టైం టు టైం మీల్స్ తినే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. చాలామంది  మీల్‌‌‌‌ రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌కు మొగ్గు చూపుతున్నారు. బిజీ లైఫ్‌‌‌‌లో బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌, లంచ్‌‌‌‌, డిన్నర్‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌లో ఏదో ఒకటి పొట్టలో పడేస్తే చాలని కొందరు అనుకుంటుంటే..  మరికొంత మంది లేటెస్ట్‌‌‌‌గా ఆరోగ్యం కోసమంటూ మీల్‌‌‌‌ సప్లిమెంట్స్‌‌‌‌ తీసుకుంటున్నారు. మీల్ సప్లిమెంట్స్ అంటే  ప్రొటీన్‌‌‌‌ షేక్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ సప్లిమెంట్స్‌‌‌‌ లాంటివి. చాలామంది బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజూ తినే తిండి మానేసి వీటివెంట పడుతున్నారు.

కొని తెచ్చుకున్నట్టే..

తినే ప్రతీ ఆహారంలో కేలరీలు, ప్రొటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ లెక్కలు వేసుకుని  తినడం ఎక్కువయింది ఈ రోజుల్లో. అందుకే అవన్నీ సమపాళ్లలో అందిస్తూ రోజుకో కొత్త సప్లిమెంట్స్, షేక్స్ పుట్టుకొస్తున్నాయి. దాంతో చక్కగా భోజనం చేసేవాళ్లు కూడా మీల్స్​కి పుల్​స్టాప్​ పెట్టి సప్లిమెంట్స్​నే తీసుకుంటున్నారు. అయితే  సప్లిమెంట్స్‌‌‌‌ని ఎలా పడితే అలా వాడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు  డైటీషియన్లు.

సమస్యలు గ్యారెంటీ

‘‘డైటరీ, మీల్‌‌‌‌ సప్లిమెంట్స్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ల సూచన మేరకు  మాత్రమే తీసుకోవాలి. మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌కూ, ప్రొటీన్‌‌‌‌ షేక్స్‌‌‌‌కు చాలా తేడా ఉంది. మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్‌‌‌‌గా చాలామంది చాకొలెట్స్‌‌‌‌, సూప్స్‌‌‌‌, షేక్స్ లాంటి రూపాల్లో తీసుకుంటున్నారు. నిజానికి ఈ మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ను ప్రత్యేకంగా వెయిట్‌‌‌‌లాస్‌‌‌‌, మెయిన్‌‌‌‌టెనెన్స్‌‌‌‌ కోసం రూపొందిస్తారు. అయితే వీటిని చాలామంది తమకు అవసరం లేకపోయినా  లంచ్‌‌‌‌, డిన్నర్‌‌‌‌, బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ కోసం వాడుతున్నారు. దీని వల్ల లాంగ్ టర్మ్‌‌‌‌లో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశముంది.

మానేయడం సరికాదు

మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ను ఒబెసిటీ, డయాబెటిక్‌‌‌‌ రోగుల కోసం కొద్ది మోతాదుల్లో మేం సూచిస్తుంటాం. నిజానికి ఓ మంచి మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్‌‌‌‌లో ప్రొటీన్స్‌‌‌‌ ఎక్కువగా ఉండటంతో పాటుగా కార్బోహైడ్రేట్స్‌‌‌‌ తక్కువగా ఉంటాయి. అదీ 2:1 రేషియోలో ఉంటాయి. వీటితో పాటుగా శరీరానికి అవసరమైన పోషకాలూ ఉంటాయి. అంతమాత్రాన ఆరోగ్యవంతమైన వ్యక్తి అవసరాలన్నీ ఇది తీరుస్తుందని చెప్పలేం. మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ను వాడటం వల్ల ప్రొటీన్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ పెరుగుతుంది.. దానివల్ల ఆకలి మందగించి భవిష్యత్‌‌‌‌లో కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే రిస్క్ తీసుకోకుండా  సమతుల్యమైన రీతిలో పౌష్టికాహారం తీసుకోవడం అన్ని విధాల మేలు.  అంటున్నారు డైటీషియన్‌‌‌‌ సుజాత స్టీఫెన్.

ఉపయోగాలేంటంటే..

ఇవి వెయిట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు సహాయపడతాయి. మీరెన్ని కేలరీలు తిన్నారో తెలుసుకోవచ్చు.

తీసుకునే కేలరీలు, లభించే శక్తిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

కార్బోహైడ్రేట్స్‌‌‌‌, ప్రొటీన్స్‌‌‌‌, విటమిన్స్‌‌‌‌,మినరల్స్‌‌‌‌ కూడా సమపాళ్లలో లభించే అవకాశాలున్నాయి

నచ్చింది కదా అని ఎక్కువ తినడం లేదా తక్కువ తినడమంటూ ఉండదు.

ప్రిపరేషన్‌‌‌‌కు తక్కువ సమయం పడుతుంది.

ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

ఇబ్బందులూ ఉన్నాయ్

మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌తో బరువు తగ్గుతారని గ్యారెంటీ లేదు

ఈ ఫుడ్‌‌‌‌ తీసుకోవడం ఆపేయగానే కోల్పోయిన బరువు పెరగడం ఖాయం

రోజుకు రెండుసార్లు మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్‌‌‌‌ చేస్తే అవి కండరాలకు తగిన శక్తిని ఇవ్వవు.

కొన్ని రకాల మీల్‌‌‌‌ రీప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఉన్న ఆర్టిఫిషియల్‌‌‌‌ స్వీట్‌‌‌‌నర్స్‌‌‌‌ ఆరోగ్యానికి ముప్పు కలిగించొచ్చు

మరికొన్నింటిలో ఉన్న హెవీ మెటల్స్ వల్ల శరీరం విషతుల్యం అవుతుంది.

ప్రొటీన్స్‌‌‌‌ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపొచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల షేక్స్‌‌‌‌లో ఫైబర్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపులో నొప్పి, లూజ్  మోషన్స్​ అయ్యే అవకాశం ఉంది.

దీనికైతే ఓకే

వెయిట్ మెయింటెనెన్స్ కోసమైతే డాక్టర్ల  సూచనలకు మేరకు మాత్రమే మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ వాడాలి. రోజుకు ఓ మీల్‌‌‌‌కు మాత్రమే రీప్లేస్​గా వాడాలి. మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్‌‌‌‌ ఏదైనా ప్రొటీన్‌‌‌‌, కార్బో హైడ్రేట్స్‌‌‌‌, డైటరీ ఫైబర్‌‌‌‌, అత్యవసర విటమిన్స్‌‌‌‌, మినరల్స్‌‌‌‌ సమపాళ్లలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.

 అందరికీ కాదు

మీల్‌‌‌‌ రీప్లేస్​మెంట్స్‌‌‌‌ అందరికీ  మంచిది కాదు. ఒబెసిటీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు వారి హెల్త్ కండీషన్‌‌‌‌ను బట్టి డాక్టర్లు  సూచిస్తే తీసుకోవాలి. ఇటీవలి కాలంలో హై ఫైబర్‌‌‌‌ ఉన్న  రాగులు,  మిల్లెట్‌‌‌‌ ఫుడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే వాటిని తినొచ్చు. అలాకాకుండా  డాక్టర్‌‌‌‌ సలహా లేకుండా వీటిని వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Latest Updates