సగం ధరకు మందు.. పండక్కి గొర్రె ఫ్రీ : వింత హామీ

ఎన్నికల వేళ పార్టీలిచ్చే హామీలు కొన్నిసార్లు జనాలకు షాకిస్తుంటాయి. నమ్మశక్యం కాని హామీలు కొందరు ఇస్తే… టెంప్ట్ చేసే హామీలు మరికొందరు ఇస్తుంటారు. ఈ టెంప్టింగ్ హామీలను పీక్స్ కు తీసుకెళ్లింది ఢిల్లీలోని సంఝి విరాసత్ పార్టీ.

సంఝి విరాసత్ పార్టీ తమ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. వారిచ్చిన హామీలు టూమచ్ గా ఉన్నాయి. ఓటు వేసే సంగతి దేవుడెరుగు.. కొన్ని హామీలైతే నోరూరించేలా ఉన్నాయి. వాళ్ల పార్టీ అధికారంలోకి వస్తే… ఆల్కహాల్ , మందుపై 50 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారట. ముస్లింలకు ఈద్ సందర్భంగా గొర్రెలను ఫ్రీగా ఇస్తారట. మహిళలకు బంగారం , నగలు ఉచితంగా ఇస్తారట.

సంఝి విరాసత్ పార్టీ అభ్యర్థి అమిత్ శర్మ.. తన ప్రచార  పోస్టర్లపై పార్టీ హామీలను ప్రింట్ చేయించాడు. నార్త్ –ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంనుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

PhD వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఫ్రీ మెట్రో- బస్ సర్వీస్ , ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య, ఫ్రీ రేషన్ సరుకులు, పాప పుడితే తల్లి అకౌంట్ లో రూ.50వేలు డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి  రూ.2లక్షల 50వేలు సాయం, నిరుద్యోగికి నెలనెలా రూ.10వేల భృతి, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రూ.5వేల పెన్షన్,  హాస్పిటల్స్ లో ఏటా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం.. ఆ పార్టీ ఇచ్చిన మిగతా హామీలు.

Latest Updates