ఢిల్లీలో చిరుజల్లులు.. నాగపూర్ లో మండే ఎండలు

దేశంలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీలో ఇవాళ వాతావరణం కాస్త చల్లబడింది. దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. మండే ఎండాకాలంలో జల్లులు పడటంతో.. ఢిల్లీ వాసులు రిలాక్సయ్యారు.

ఇటు మహారాష్ట్ర సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నాగ్ పూర్ లో నమోదయ్యాయి. ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం నాగపూర్ లో దేశంలోనే గరిష్టంగా 43.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.

 

Latest Updates