2019-20కి 2020-21 బడ్జెట్‌కు వ్యత్యాసాలివే!

అసెంబ్లీలో 2020-21 గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్ రావు. అయితే గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఖర్చు, రెవెన్యూ మిగులు, ఈ బడ్జెట్ లకు వ్యత్యాసాలు ఒక్కసారి చూసినట్లైతే…

2018-19 అకౌంట్లు(ప్రొవిజనల్)

2018-19 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రూ.1,57,150.80 కోట్లు ఖర్చు అయ్యింది. రెవెన్యూ మిగులు రూ. 4,337.08 కోట్లు. ద్రవ్య లోటు రూ.26,943.87 కోట్లు.

2019-2020 సవరించిన అంచనాలు

సవరించిన అంచనాల ప్రకారం 2019-20 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం రూ.1,42,152.28 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,10,824.77 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.13,165.72 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 103.55 కోట్లు.

2020-21 బడ్జెట్ అంచనాలు

2020-21 ఆర్థిక సంవత్సరం రూ.1,82,914.42 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.22,482.12కోట్లు కాగా. ఆర్థిక లోటు రూ. 33,191.25కోట్లు ఉంటుందని అంచనా.

Latest Updates