బస్తీల్లో డిజిటల్ క్లాస్ లు

  • పేద విద్యార్థినులకు అండగా అప్సా స్వచ్ఛంద సంస్థ

 హైదరాబాద్ సిటీలో 30 ఏళ్లుగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించే ‘అప్సా’ స్వచ్ఛంద  సంస్థ  మరో అడుగు ముందుకేసి పేద బాలికలకు ఉచితంగా డిజిటల్‌ ట్యూషన్లు, ప్రైవేటు క్లాసులు చెబుతోంది. బస్తీల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుం డగా, సంస్థ ద్వారా 2,500 మంది విద్యార్థినులు లబ్ధి పొందుతున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ తరగతులు జరుగుతుండగా, క్రమం తప్ప కుండా పిల్లలు హాజరవుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

రోజులో మూడు సెషన్లుగా జరిగే ఈ క్లాసులకు వచ్చే విద్యార్థులకు ముందుగా హబ్‌ లో టీచర్లు సిద్ధం చేసిన డిజిటల్‌ క్లాసులను టెలికాస్ట్‌‌ చేస్తారు. ఆ తర్వాత టీచర్‌ హబ్‌ నుంచే అదే పాఠాన్ని చెబుతూ ఉంటుంది. ఒకవేళ విద్యార్థికి ఏదైనా డౌట్ వస్తే వెంటనే క్లారిఫై చేసుకునేందుకు వీడియో ఇంటరాక్షన్ తో వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌‌ ఆధారంగానే డిజిటల్‌ క్లాసులను శ్రద్ధగా వినేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. సెంటర్లో విద్యార్థులను మానిటరింగ్‌ చేసేందుకు ఒక మేనేజర్‌, కో–ఆర్డినేటర్‌ తో పాటు అర్హత, అనుభవం కలిగిన ఐదుగురు సబ్జెక్టు టీచర్లు హబ్‌ లో ఉంటారు. చదువు మధ్యలో మానేసిన పిల్లలకు ఓపెన్‌‌ స్కూల్‌ లో చేర్పించడంతో పాటు ఫీజులు భరించలేని విద్యార్థులెవరైనా ఉంటే వారికి అండగా నిలబడి ఫీజులు చెల్లించి, డిజిటల్‌ క్లాసుల సాయంతో పదో తరగతి పూర్తి చేసేలా ప్రోత్సహిస్తా రు. ఆ తర్వాత కంప్యూటర్‌ కోర్సులో ట్రైనింగ్ తో పాటు ఏదైనా సంస్థలో ప్లేస్‌‌ మెంట్‌ ఇప్పించేంత వరకు ఈ సంస్థ కృషి చేస్తుంది.

11 సెంటర్లు.. ఒక హబ్‌…

హైదరాబాద్ నగరంలోని  అమ్ముగూడ, సిద్దిఖీ నగర్‌ , రంగానగర్‌ ,బతుకమ్మకుంట, చాచా నెహ్రు నగర్‌ , బాపూజీ నగర్‌ ,రామ్‌ నగర్‌,నల్లగుట్ట, చిత్రాల నగర్‌ ,పాటిగడ్డ వంటి బస్తీ ప్రాంతాల్లో దాదాపు 11 డిజిటల్‌ క్లాస్‌ సెంటర్లు ఉండగా… వీటిని అనుసంధానం చేస్తున్న డిజిటల్ హబ్‌ తార్నాకలో ఉంది. ఇక్కడి నుంచే 8,9,10 క్లాసుల చదువుతున్నవిద్యార్థులకు మ్యాథ్స్‌ , ఇంగ్లీష్, సైన్స్‌ సబ్జెక్టులను డిజిటల్‌ స్క్రీన్ పై పాఠాలు చెబుతున్నారు. బాలికలకు మాత్రమే ప్రవేశం ఉండగా, ట్యూషన్ ఫీజులు భరించే ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థినులు, డ్రాపౌట్‌‌ పిల్లలు బడి ముగియగానే ఉత్సాహంగా వచ్చి పాఠాలు వింటారు. ఒక వేళ సెంటర్‌ కు రోజు వచ్చే పిల్లలు హాజరు కాకపోతే, కారణాలు తెలుసుకుని, మళ్లీ వచ్చేలా తల్లిదండ్రులకు సంస్థ కౌన్సెలింగ్‌ చేస్తుంది.

Latest Updates