రామ మందిర నిర్మాణానికి దిగ్విజయ్ సింగ్ విరాళం

భోపాల్: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రూ.1.11 లక్షలను డొనేట్ చేశారు. ఈ మేరకు చెక్కును ప్రధాని మోడీకి పంపిన దిగ్విజయ్.. దాంతోపాటు రెండు పేజీల లేఖను కూడా పంపారు. భవ్య రామ మందిర నిర్మాణం కోసం గతంలో అందిన డొనేషన్స్ వివరాలను విశ్వ హిందూ పరిషత్‌‌ పబ్లిక్‌‌గా వెల్లడించాలని మోడీని దిగ్విజయ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రామాలయ నిర్మాణానికి విరాళం చేసిన తొలి నేత దిగ్విజయ్ కావడం గమనార్హం.

Latest Updates