10ఏళ్ల వయస్సులోనే నాపై లైంగిక వేధింపులు..తప్పులేనప్పుడే వాయిస్ వినిపించాలి

నేను 10 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా. ఆ వేదనను మాటల్లో చెప్పడానికి వీలు లేకుండా వుంది అంటూ ప్రముఖ బాలీవుడ్ వుడ్ సింగర్ నేహాన్ బాసిన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో సింగర్ నేహాన్ మాట్లాడుతూ  తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. పదేళ్ల వయస్సులో నేను హరిద్వార్‌కి వెళ్లాను. అక్కడ మా అమ్మ నాకు కాస్త దూరంలో నిల్చోని ఉంది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అక్కడి నుంచి పారిపోయా. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సంఘటనలు నాకు బాగా గుర్తున్నాయి. ఇక ఒకానొక సమయంలో కే-బ్యాండ్‌కి నేను పెద్ద అభిమానిని కాదు అని చెప్పినందుకు చాలా మంది నన్ను బెదిరించారు. నిన్ను చంపేస్తాము, రేప్‌ చేస్తాం అని ఆన్‌లైన్‌లో నాకు మెసేజ్‌లు వచ్చేవి. వాటితో అలానే ఉండాలని నేను అనుకోలేదు. అందుకే వారిపై ఫిర్యాదు చేశా. ఏ తప్పు లేకుండా ఎవ్వరూ శిక్ష అనుభవించకూడదు. తప్పు లేనప్పుడు వారి వాయిస్‌ని వినిపించాలి అని అన్నారు సింగర్ నేహాన్ బాసిన్.

 

 

Latest Updates