ఐటీ దాడులు కామన్: దిల్ రాజు

Dil raju Responds about iT rides at his office

‘మహర్షి’ సినిమా నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. మహర్షి సినిమా బిజినెస్ భారీ స్థాయలో జరిగినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడులను దిల్ రాజు లైట్ తీసుకున్నారు.

బంజారాహిల్స్ సాగర్ సొసైటీ తన కార్యాలయంలో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై దిల్ రాజు స్పందిస్తూ..‘ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.తన సంస్థలో ఐటీ రిటర్న్స్  అన్ని క్లియర్ గా ఉన్నాయన్నారు.  6 గంటలపాటు ఐటీ అధికారులు ఫైల్స్ వెరిఫై చేశారని, అధికారులకు పూర్తిగా సహకరించానని అన్నారు.

సినిమా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 షోలకు అనుమతిచ్చిందన్నారు. టిక్కెట్ల ధరల విషయంలో కూడా కోర్టు అనుమతి తీసుకొని వాటి ధరను నిర్ణయించామని దిల్ రాజు అన్నారు.

మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మహర్షి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.