బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు ఎహ్సాన్ ఖాన్ (90) గురువారం మరణించాడు. ఎహ్సాన్ ఖాన్ కరోనావైరస్‌తో ఆగష్టు 15న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఎహ్సాన్ ఖాన్.. ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు. ఎహ్సాన్ ఖాన్ మరణవార్తను దిలీప్ కుమార్ స్నేహితుడు ఫైసల్ ఫారూకి ట్వీట్ చేశారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం ఆగష్టు 21న దిలీప్ కుమార్ మరో సోదరుడు అస్లాం ఖాన్ ఆగష్టు 21న కరోనాతోనే మరణించారు. ఆయన కూడా ఎహ్సాన్ ఖాన్‌తో పాటు ఆగష్టు 15నే లీలావతి ఆస్పత్రిలో చేరారు. అస్లాం ఖాన్‌కు డయాబెటిస్, రక్తపోటు మరియు న్యుమోనియా జబ్బులున్నాయి. దాంతో ఆయనకు ఆర్గాన్స్ ఫెయిలయి ఆగష్టు 21న మృతిచెందినట్లు డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు.

దిలీప్ కుమార్, అతని భార్య సైరా భాను లాక్‌డౌన్‌కు ముందే కరోనావైరస్ వల్ల ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

For More News..

వేరుకాపురం పెట్టిన కొన్ని రోజులకే భార్యాభర్తల ఆత్మహత్య

సరస్సులో పడి చనిపోయిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ సిబ్బంది

యాక్సిడెంట్ అయిన వాళ్లను దగ్గరుండి ఆస్పత్రికి పంపిన బండి సంజయ్

Latest Updates