బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్

బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేయడంతో క్షమాపణలు చెప్పాడు దినేశ్ కార్తీక్. అనుమతి లేకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌కు వెళ్లిన కార్తీక్ ఆ జట్టు తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించాడు. దీంతో రూల్స్ బ్రేక్ చేశాడని కార్తీక్ కు నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. ట్రిన్ బాగో టీమ్ షారూక్ ఖాన్ ది ..అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు దినేశ్ కార్తీక్ కెప్టెన్. కోల్ కతా కోచ్ బ్రెండన్ మెక్ కలమ్ పిలిచినందుకే  ఈవెంట్ కు వెళ్లానని బీసీసీఐకి వివరణ ఇచ్చాడు దినేశ్ కార్తీక్.

Latest Updates