డైనోసార్లు అంతరించిన ఆ రోజు

Dinosaurs fossils that appear in North Dakota
  • భూమిని ఢీ కొట్టిన చిక్సులుబ్ ఉల్క
  • చనిపోయిన 75 శాతం జీవరాశి
  • నార్త్ డకోటాలో వాటి చివరి ఘడియల ఆనవాళ్లు
  • ఐదేళ్లకు పైగా నడిచిన పరిశోధనలో సంచలన నిజాలు

దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం ఓ భారీ ఉల్కభూమిని ఢీ కొట్టింది. దాని తాకిడికి నేల నవనాడులు కంపించిపోయాయి. క్షణాల్లో భారీభూకంపం(10 లేదా 11 తీవ్రతతో), సునామి విరుచుకుపడ్డా యి. ఇవి చాలదన్నట్లు మరికొన్ని ఉల్కలు 200 మైళ్లకు పైగా వేగంతో మిస్సైల్స్ లా దూసుకొచ్చాయి. కొద్ది నిమిషాల్లో నే భూమ్మీదున్న 75 శాతం జీవరాశిని తుడిచిపెట్టేశాయి. ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొన్న ప్రదేశాల్లో అమెరికాలోని  నార్త్ డకోటా కూడా ఒకటి. ఇక్కడున్న హెల్ క్రీక్స్ ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల ‘టానిస్’లో ఆరేళ్లుగా నడుస్తున్న పరిశోధనలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ఈ సమయంలో టానిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రెటాసేషియస్ యుగానికి చెందిన కొన్ని కోట్ల జీవజాతులు ఉన్నాయట. రీసెర్చర్ రాబర్ట్ డీ పాల్మా చేపట్టిన తవ్వకాల్లో చేపలు, చెట్లు, ఉభయచరాలు, పురుగులు, పాములు,  ట్రైసెప్టార్స్ శిలాజాలు బయటపడ్డా యి. దాదాపు 30 అడుగుల రాకాసిఅల వీటన్నింటిని సజీవ సమాధి చేసిందని ఆయనభావిస్తున్నారు . ఇలా చనిపోయిన జీవుల్లో అన్నివయసులవీ ఉన్నాయని అన్నారు . సముద్రంలోఎగసిన అలలు, నార్త్ డకోటాలోని నదీ ప్రవాహాన్నిఅడ్డుకోవడంతోనే ఈ ఉపద్రవం సంభవించిందని చెప్పారు. కొన్ని చోట్ల ఒడ్డుకు కొట్టుకొచ్చిన జీవులు ఉల్కల వర్షం ధాటికి చనిపోయాయని రాబర్ట్ వెల్లడించారు. ఎందుకంటే ఉల్కలు, తోకచుక్కల్లోఎక్కువగా దొరికే ఇరీడియంతో శిలాజాలన్నీకప్పబడివున్నాయని వివరించారు. పరిశోధనలో ఆయనతో పాటు కాలిఫోర్నియా, బర్కిలీ, వ్రిజేయూనివర్సిటీల సైంటిస్టులు కూడా తమ వంతు రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

Latest Updates