యూఎస్ ఓపెన్ లో నగాల్ కు డైరెక్టు ఎంట్రీ

నడాల్ ఔట్.. ఫెదరర్ దూరం

న్యూఢిల్లీ: ఇండియా మెన్స్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ ప్లేయర్‌‌ సుమిత్‌ నగాల్‌‌కు అదృష్టం కలిసొచ్చింది. కరోనా నేపథ్యంలో కొంత మంది టాప్‌ ప్లేయర్లు యూఎస్‌ ఓపెన్‌‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో.. సింగిల్స్‌ మెయిన్‌‌ డ్రాలో నగాల్‌‌కు డైరెక్ట్‌‌ ఎంట్రీ లభించింది. వరల్డ్‌‌ ర్యాంకిం గ్స్‌ లో ప్రస్తు తం 127వ స్థానంలో ఉన్న సుమిత్‌ .. ఈసారి డైరెక్ట్‌‌ ఎంట్రీ సాధించిన లాస్ట్‌‌ ప్లేయర్‌‌. ఇక ఈ ఏడాది టోర్నీకి అర్హత సాధించిన ఏకైక ఇండియన్‌‌ ప్లేయర్‌‌ కూడా. 132వ ర్యాంక్‌ లో ఉన్న ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌‌కు నిరాశ ఎదురైంది.

మరోవైపు ఈ నెల 31 నుంచి మొదలయ్యే యూఎస్‌ ఓపెన్‌‌లో తాను బరిలోకి దిగడం లేదని స్పెయిన్‌‌ స్టార్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ బుధవారం ప్రకటించాడు. గాయం వల్ల స్విస్‌ లెజెండ్‌ రోజర్‌‌ ఫెడరర్‌‌ కూడా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. దీంతో బిగ్‌‌–3లో ఒకడైన సెర్ బియా టాప్‌ స్టార్‌‌, వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ నొవాక్‌ జొకోవిచ్‌‌ మాత్రమే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Latest Updates