చైతు చేసిన పనిని నేను మర్చిపోలేను!

సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు తెచ్చకున్న బాబీ ఆ తర్వాత  డైరెక్టర్ గానూ  తనదైన ముద్ర వేశారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘వెంకీ మామ’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా  బాబీ చెప్పిన విశేషాలు..

‘జై లవకుశ’ తర్వాత మరో స్ర్కిప్టు రెడీ చేసుకుంటుంటే కోన వెంకట్ వచ్చి… వెంకటేష్​, నాగచైతన్యల కాంబినేషన్‌‌లో సురేష్‌‌ ప్రొడక్షన్‌‌ వారు ఒక సినిమా చెయ్యాలనుకుంటున్నారని, ఓసారి వెళ్లి స్టోరీ లైన్ వినమని చెప్పారు. వాళ్లు రాసుకున్నదాన్నినేనెలా ఇంప్లిమెంట్ చేస్తాను, నా కథయితే చేస్తాను అన్నాను. కానీ వదల్లేదు. ఆ కథ నాకు చెప్పించారు. లైన్ నచ్చింది కానీ ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో మౌనంగా ఉండిపోయా. తర్వాత సురేష్‌‌బాబు గారు రమ్మంటే వెళ్లాను. కథ నాకు నచ్చలేదని చెప్పేశాను. అయితే నువ్వే ఒకటి రాయి అన్నారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ కథ తయారు చేశా.

వెంకటేష్​గారు మిలిటరీ నాయుడుగా ఊరిలో చెలామణి అవుతుంటారు. కానీ తను మిలిటరీకి అసలు వెళ్లలేదు. నాయుడు ఇద్దర్నే నమ్ముతాడు… రైతుని,  సైనికుణ్ని. మంచి ప్రిన్సిపుల్స్​ఉన్న వ్యక్తి. నాగచైతన్య చదువుకున్నా మేనమామ చాటు బిడ్డలా పెరుగుతాడు. కానీ ఆర్మీకి వెళతాడు. సీరియస్​ బ్యాక్‌‌డ్రాప్​ ఏమీ ఉండదు. ఎక్కువగా ఫన్ ఉంటుంది. కొంచెం ఎమోషన్​ తోడయ్యింది. హీరోలిద్దరి పాత్రలూ సమానంగా ఉంటాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఎక్కడా అనిపించదు. సినిమా చేస్తున్నప్పుడు నేను ఒక్కటే అనుకున్నా. సినిమా చూసే ప్రతివారికీ వాళ్ల మేనమామ ఎక్కడున్నా గుర్తు రావాలి.

సినిమాకి మంచి టీమ్ కూడా కుదిరింది. వెంకటేష్​గారి పక్కన పాయల్‌‌ని తీసుకోవడానికి కారణం.. ఆమె యంగ్ అయినా ముఖంలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆడిషన్స్ చేసినప్పుడు కూడా ఆమె పర్‌‌‌‌ఫెక్ట్ అనిపించింది. ఇక రాశి డేట్స్‌‌ లక్కీగా దొరికాయి. తమన్ మంచి మ్యూజిక్​ఇచ్చాడు.

దసరాకి రిలీజవ్వాల్సిన సినిమా ఇది. ఒక సాంగ్​ తీసేటప్పుడు వెంకటేష్​గారి కాలుకి చిన్న గాయం అవడం వల్ల షూటింగ్​ కొంచెం వాయిదా పడింది.  మరికొన్ని రీజన్స్​ వల్ల కూడా డిలే అవుతూ ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుందనే అన్నారు. చైతూ అయితే నన్ను హగ్​ చేసుకుని థాంక్యూ బ్రదర్​ అన్నాడు. అది నేనెప్పటికీ మరచిపోలేను.

ఈ సినిమాలో ఎమోషన్‌‌ని ఎక్కువ యాడ్ చేశాను కానీ.. బేసిగ్గా నాకు కమర్షియల్​ జానర్​ అంటేనే ఎక్కువ ఇష్టం. నేనేమీ పెద్ద పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనేది నియమంగా పెట్టుకోలేదు. కాకపోతే మంచి సినిమాలు మాత్రం తీయాలనుంది. ప్రస్తుతానికి నా దగ్గర  రెండు స్టోరీలు రెడీగా ఉన్నాయి. వాటిలో ఏది ముందు మొదలుపెడతానో డిసైడయ్యాక చెబుతానన్నారు.

Latest Updates