దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగభరణం’ తర్వాత ఆయన మరే చిత్రానికీ దర్శకత్వం వహించలేదు.

Latest Updates