తమన్నా తప్పుకోవడం అడ్వాంటేజ్: ఓంకార్

ఓవైపు బుల్లితెర.. మరోవైపు వెండితెర.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఓంకార్. ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు రూపొందించిన ఆయన.. మూడో సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా  ఓంకార్ చెప్పిన విశేషాలు. 

ఓ ఫ్రాంచైజీని కావాలని క్రియేట్ చేయడం కుదరదు. అదృష్టం కొద్దీ ‘రాజుగారి గది’కి ఆ వాల్యూ దక్కింది. మంచి స్టోరీ లైన్‌‌కి వినోదం కుదిరి ఫస్ట్ ఫార్ట్ సక్సెస్ అయ్యింది. రెండో భాగంలో కామెడీ మిస్ అయ్యాం. దాన్ని  భర్తీ చేస్తూ తొలి పార్ట్​ని మించిన వినోదాన్ని పంచాం.

నేను బడ్జెట్, స్టార్ వాల్యూ చూడను. కథని నమ్ముతాను. ‘రాజుగారి గది’కి ఆ రోజున అశ్విన్ కరెక్ట్ అని తీసుకున్నాను. అంతే తప్ప తనని హీరోని చేయాలని కాదు. కానీ హీరోని చేస్తానని నా తమ్ముడికి ఇచ్చిన మాట, నా బాధ్యత ఈ సినిమాతో తీరుతోంది.

తమన్నా తప్పుకున్నాక కాజల్, తాప్సీ లాంటి స్టార్స్‌‌ని సంప్రదించాం. కాజల్ ఆసక్తి చూపించినా వరుసగా డేట్స్ ఇవ్వడం వీలు పడలేదు. దాంతో ఆ క్యారెక్టరైజేషన్‌‌ని అశ్విన్‌‌కి తగ్గట్టు మార్చాను. అలా తమన్నా గారు తప్పు కోవడం అశ్విన్‌‌కి అడ్వాంటేజ్ అయింది.

అశ్విన్​కి ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా గుర్తింపు వస్తుంది. గతంలో అవికా గోర్ ఇలాంటి పాత్ర చేయలేదు కనుక తనని దెయ్యం పాత్రకి తీసుకున్నాం. అద్భుతంగా నటించింది.

తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు 2’ నుంచి మూల కథ తీసుకుని మార్పులు, చేర్పులు చేశాం. చిన్న సినిమాలా అనిపించదు. చోటా కె నాయుడు, సాయిమాధవ్ బుర్రా, గౌతం రాజు లాంటి ప్రముఖ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. కథపై నమ్మకంతో ఖర్చుకు వెనకాడలేదు. టాలీవుడ్ టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్‌‌లో తప్పకుండా చేరుతుంది.

ప్రేక్షకుల్లో చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకుని హారర్ సినిమా చేయగలిగితే సక్సెస్‌‌ని ఎవరూ ఆపలేరు. ఈ సినిమా ఆ లక్ష్యంతోనే చేశాను. నా ‘మాయా ద్వీపం’ టీవీ షో తరహాలో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా అవుతుంది.

కార్తికేయ ఎగ్జిబిటర్స్ వరంగల్ శ్రీను గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.  సినిమా ప్రారంభానికి ముందే కథ నచ్చి మాటీవీ, హాట్ స్టార్ సంస్థలు శాటిలైట్, డిజిటల్ రైట్స్ తీసుకున్నాయి.

నా తర్వాతి చిత్రానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘రాజుగారి గది 4’. మరొకటి స్పోర్ట్స్ డ్రామా. హాట్ స్టార్ వాళ్లు వెబ్ సిరీస్ చేయమని అడుగుతున్నారు. ముందుగా ఏది పట్టాలెక్కుతుందో చూడాలి.

 

నిజానికి ‘రాజుగారి గది–2’ ని వెంకటేష్ గారితోనే చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరలేదు. అందుకే నాగార్జున గారితో తీశాను. కానీ కచ్చితంగా ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీలో వెంకటేష్ గారి సినిమా ఉంటుంది. అది ఎప్పుడనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేను.

నాకు యాక్టర్ అవ్వాలనే కోరిక లేదు. దర్శకుడిగా ఏ స్థాయికి ఎదిగినా టీవీని  వదలను. టీవీ లేకుంటే ఓంకార్ లేడు. అందుకే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తు న్నాను. తాజాగా ‘సిక్స్త్ సెన్స్’ షో మూడో సీజన్ ప్రోమో చిత్రీకరించాం. బిగ్ బాస్ పూర్తయ్యాక ఆ
శ్లాట్​లో  ప్రసారమౌతుంది.

 

Director Omkar comments on his new movie Raju gari gadi3

Latest Updates